News March 14, 2025

ఈ ఐదు రోజులు జాగ్రత్త!

image

TG: వేసవి వచ్చేసింది. అసలే ఓవైపు ఎండలు దంచికొడుతుంటే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వెదర్‌మ్యాన్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 19 వరకు వేడిమి మరీ ఎక్కువ ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా ఆరుబయట పని చేసే రైతాంగం చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని కోరారు. అయితే ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు స్వల్ప ఉపశమనం లభిస్తుందని, ఆ 5 రోజుల పాటు స్వల్ప వర్షపాతం ఉంటుందని తెలిపారు.

Similar News

News March 15, 2025

బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

image

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.

News March 15, 2025

ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్

image

TG: పదేపదే తాను ఢిల్లీకి వెళ్తున్నానంటూ BRS చేస్తున్న విమర్శలకు CM రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటివారే. కేంద్రం తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఏముంది? ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ప్రతి కేంద్రమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తున్నా’ అని తెలిపారు.

News March 15, 2025

ఫాస్ట్ ఫుడ్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త

image

వీకెండ్ వచ్చిందంటే చాలు బయటి ఫాస్ట్ ఫుడ్ తినడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది. అలా తినేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌లోని ఏఐఎన్‌యూ వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఫాస్ట్ ఫుడ్ కారణంగా యువతలో మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువ అవుతున్నాయి. క్రియాటినిన్ స్థాయులు పెరుగుతున్నాయి. చాలామంది ఇదే సమస్యలతో ఆస్పత్రులకు వస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీలకు ప్రమాదం’ అని వారు పేర్కొన్నారు.

error: Content is protected !!