News March 24, 2024

ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు అందుబాటులో ఉంచాలి: కలెక్టర్

image

పదో తరగతి పరీక్షల నిర్వహణ జిల్లా కలెక్టర్ విపి. గౌతమ్ శనివారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్ లో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు.

Similar News

News December 28, 2025

ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్‌ వద్ద రోడ్డు ప్రమాదం

image

ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిలో, వెనుక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఆమె కాళ్లపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది.

News December 27, 2025

అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

News December 27, 2025

ప్రయాణికులకు ఊరట.. ఖమ్మం మీదుగా 10 ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ డి.రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.