News March 14, 2025
NGKL: హోలీ పండుగ వేళ విషాదం.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హోలీ పండుగ వేళ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెలుగొండకు చెందిన రమేశ్(38) స్నేహితులతో కలిసి ద్విచక్రవాహనంపై బుద్దారంగండి నుంచి బిజినేపల్లికి వస్తున్నాడు. ఈ క్రమంలో శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొకరికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రమేశ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు.
Similar News
News March 1, 2026
అమరాపురంలో బొలేరో బోల్తా.. ప్రమాదంలో 12 మంది

అమరాపురంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తముడేపల్లి గ్రామ సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. 12 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రోళ్ల మండలం HT.హళ్లి గ్రామంలో నామకరణ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 1, 2026
హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

<
News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.


