News March 15, 2025
పవన్ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యా: చిరంజీవి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సభకు వచ్చిన జనసంద్రంలాగే తన మనసు ఉప్పొంగిందని ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మెగాస్టార్ ఆశీర్వదించారు.
Similar News
News March 15, 2025
WPL: ఫైనల్ విజేత ఎవరో?

నేడు WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఉవ్విళ్లూరుతున్నాయి. ఆల్‌రౌండర్లు నాట్ సీవర్, హేలీ మాథ్యూస్‌లతో ముంబై టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ముంబైపై ఢిల్లీదే ఆధిపత్యం. కాగా మ్యాచ్ రా.8.00 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లలో లైవ్ చూడవచ్చు.
News March 15, 2025
ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తులు ప్రారంభం

ఏపీఈఏపీ సెట్ 2025కు శనివారం నుంచి ఏప్రిల్ 24వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఛైర్మన్ ప్రసాద్ ప్రకటించారు. అపరాధ రుసుము రూ10,000 చెల్లింపుతో మే16 వరకూ అప్లై చేసుకోవచ్చన్నారు. మే19-27 వరకూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. JNTU వర్సిటీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
News March 15, 2025
భద్రాద్రి సీతారామ కళ్యాణ మహోత్సవ పనులు ప్రారంభం

TG: భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మెుదలయ్యాయి. శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా అర్చకులు రోలు రోకలికి పూజచేసి పసుపు కొమ్ములు దంచారు. బియ్యాన్ని తలంబ్రాలుగా చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్’ యాప్‌ను ఈవో ఆవిష్కరించారు. యాప్ సేవలు పదిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.