News March 15, 2025
ASF: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

ఆసిఫాబాద్ జిలాల్లో శుక్రవారం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దండే విట్టల్ అధ్యర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ దిపక్ తివారి, తదితరులు హాజరయ్యారు. అనంతరం విందును స్వీకరించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మొహమ్మద్ సద్దాం, మొయిన్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
సిరిసిల్ల: ఆత్మరక్షణ విద్య శిక్షకుల దరఖాస్తుల ఆహ్వానం

ఆత్మ రక్షణ విద్య శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి రాందాస్ ఒక ప్రకటనలో కోరారు. జిల్లావ్యాప్తంగా విద్యార్థినులకు ఆత్మ రక్షణ కోసం కరాటే, కుంగ్ఫూ, జూడో తదితర ఆత్మరక్షణ విద్యలలో శిక్షణ ఇచ్చేందుకు నిపుణులైన శిక్షకులను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్హత కలిగిన పురుషులు, మహిళలు ఈనెల ఆరో తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News January 2, 2026
మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందులను పరిశీలించి రికార్డులపై ఆరా తీశారు. ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News January 2, 2026
భద్రాద్రి: హిడ్మా ఎన్కౌంటర్ ఉదంతం.. లేఖ కలకలం

మావోయిస్టు అగ్రనేత మడివి హిడ్మా ఎన్కౌంటర్ ఉదంతంపై మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖ కలకలం రేపుతోంది. భద్రాచలానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకుడి కుట్ర వల్లే హిడ్మా పట్టుబడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. అనారోగ్యంతో ఉన్న హిడ్మాను ఆసుపత్రికి తరలిస్తానని నమ్మించి, పోలీసులకు సమాచారం ఇచ్చి రివార్డు సొమ్ము కోసం కుట్ర పన్నారని ఆరోపించారు.


