News March 15, 2025

శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి: ఎస్పీ

image

మహిళలు/అమ్మాయిల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, అమల్లోకి తీసుకొచ్చిన శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్పీ వి. రత్న సూచించారు. ఈ శక్తి యాప్ పట్ల జిల్లాలో విస్తృతంగా అవగాహన కల్పించాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ మహిళ తమ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం పొందేలా చైతన్యం చేయాలన్నారు.

Similar News

News March 8, 2026

NZB: 246 కేసులు.. రూ 20.30 లక్షల జరిమానా: CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 246 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కేసుల్లో పట్టుబడిన వారిని కోర్టుల్లో హాజరు పరచగా రూ.20.30 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 16 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News March 8, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 8)

image

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం

News March 8, 2026

కామారెడ్డి: చిన్నారుల మిస్సింగ్.. విషాదాంతం..!

image

కామారెడ్డి ఆర్బీనగర్ కాలనీలో అదృశ్యమైన <<19324752>>ముగ్గురు చిన్నారులూ<<>> మృతి చెందారు. అక్కచెల్లెలైన సిపత్ (8), అయాత్ (7), మరియం(5) కామారెడ్డి సమీపంలో విగతజీవులుగా కనిపించారు. ఇప్పటికే ఇద్దరి మృతదేహాలను గుర్తించగా.. కొద్దిసేపటి క్రితమే సిపత్ డెడ్‌బాడీ లభ్యమయ్యింది. కాగా పోలీసుల అదుపులో చిన్నారుల తండ్రి ఉన్నట్లు సమాచారం.