News March 24, 2024

ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించాలి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా శనివారం గుంటూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో, భద్రపరిచిన ఈవీఎంల గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా చర్యలు, పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫిరంగిపురంలో వీవీ ప్యాట్‌లను కూడా పరిశీలించారు.

Similar News

News March 27, 2026

GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

image

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.

News March 27, 2026

GNT: ఉపాధి పనులకు లక్ష్యాలు..!

image

గుంటూరు జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 30 వేల పనిదినాలు సృష్టించాలనే లక్ష్యం పెట్టారు. పనుల ఎంపికలో ఆమోదం పొందిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒక్కో గ్రామంలో కనీసం 30 పనులు ఒకేసారి కొనసాగించాలని ఆదేశించారు. ఈ నెల 31లోపు మస్టర్లు ముగించాలని గడువు పెట్టారు. వివరాలు యుక్తధారా పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.

News March 27, 2026

గుంటూరులో ఆర్టీఈ ప్రవేశాలు పెరుగుదల

image

పేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించే ఆర్టీఈ అమలు వేగం పెరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరులోనే 1,708 మందికి అవకాశాలు లభించాయి. లాటరీ విధానంలో పారదర్శకంగా ఎంపిక జరిగింది. ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు భరిస్తుంది. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.