News March 15, 2025
దోమకొండ: సంతకం ఫోర్జరీ ఇద్దరిపై కేసు

గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్ఐ స్రవంతి తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు జీపీ సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు, రసీదులు క్రియేట్ చేస్తూ, గోల్డ్లోన్ నుంచి గోల్డ్ విత్ డ్రా చేశారు. మరో వ్యక్తికి పోలీసు కేసు షూరిటీ విషయంలో ప్రయత్నించారు. ఇద్దరిపై సెక్రటరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News September 19, 2025
రేపు జోగులాంబ ఆలయం మూసివేత

అలంపూర్‌లో వెలిసిన జోగులాంబ దేవి ఆలయాన్ని రేపు మధ్యాహ్నం 1:00 నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఈవో దీప్తి శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుండటంతో ఆలయ శుద్ధి, పవిత్రోత్సవం నిర్వహణకు ఆలయాన్ని మూసివేస్తారని తెలిపారు. బాల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం యథావిధిగా ఉంటుందన్నారు. భక్తులు మార్పును గమనించి సహకరించాలని కోరారు.
News September 19, 2025
ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్‌తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జెన్నిఫర్ తెలిపారు.
News September 19, 2025
దేశంలో ఉస్మానియా మెడికల్ కాలేజీకి 48వ స్థానం

ఇటీవల ప్రకటించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్స్- 2025లో ఉస్మానియా మెడికల్ కాలేజీ 51.46 స్కోరుతో వరుసగా రెండోసారి 48వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ కోసం దేశ వ్యాప్తంగా 223 మెడికల్ కాలేజీలు పోటీ పడ్డాయి. ఎయిమ్స్ (న్యూఢిల్లీ) 1వ ర్యాంకులో నిలవగా PGIMER (చండీగఢ్), CMC (వెల్లూర్), జిప్మర్ (పాండిచేరి) మొదటి 3 ర్యాంకుల్లో నిలిచాయి.