News March 15, 2025
ASF: ‘PMSY పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మత్స్యశాఖ అధికారి రాజు నర్సయ్య అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 14000ల మత్స్యకారులు ఉన్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.6000 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని ప్రారంభించిందని పేర్కొన్నారు. ఈ పథకం కోసం నిర్మల్ జిల్లాలోని మత్స్యకారులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 15, 2025
కాణిపాకంలో రేపు లడ్డూ వేలంపాట

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి మహాప్రసాదం లడ్డూకు బహిరంగంగా వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచల కిశోర్ తెలిపారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు రేపు 21వ రోజు కావడంతో 21 కేజీల లడ్డూను తెప్పోత్సవం ముగిసిన తర్వాత కోనేరు ఎదుట వేలం వేయనున్నారు.
News September 15, 2025
రాయలసీమ కోనసీమ అవుతోంది: సీఎం

AP: రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్ లాంటి విధానాలతో మంచి ఫలితాలు సాధించామని, ఇప్పుడది కోనసీమగా మారుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. పట్టిసీమతో డెల్టాలో వాడే కృష్ణానీటిని పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగామని తెలిపారు. హంద్రీనీవా కాలువతో కుప్పం వరకూ కృష్ణా నీళ్లు తీసుకెళ్లామన్నారు. వాణిజ్య పంటల విషయంలోనూ సరైన సమయానికి నిర్ణయాలు తీసుకుని లాభం వచ్చేలా చేయాలని కలెక్టర్లకు సూచించారు.
News September 15, 2025
పాక్‌పై గెలిచాక భార్యతో SKY సెలబ్రేషన్స్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి హోటల్‌కు తిరిగి వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కి తన భార్య దేవిషా శెట్టి నుంచి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన బర్త్‌డే కావడంతో స్పెషల్ కేక్ కట్ చేయించారు. అంతేకాదు ఆయన నుదురుపై కేకు తిలకం దిద్దారు. దీనికి సంబంధించిన ఫొటోలను దేవిషా తన ఇన్‌స్టా అకౌంట్‌లో పంచుకున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే మై స్పెషల్ వన్’ అని రాసుకొచ్చారు.