News March 15, 2025
బాపట్ల జిల్లా కలెక్టర్ సూచనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛత దివాస్ కార్యక్రమం శనివారం సూర్యలంక బీచ్‌లో జరగనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పాల్గొంటున్నట్లు కలెక్టర్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు.
Similar News
News March 15, 2025
WPL: ఫైనల్ విజేత ఎవరో?

నేడు WPL ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని ఢిల్లీ, రెండో ట్రోఫీ ఖాతాలో వేసుకోవాలని ముంబై ఉవ్విళ్లూరుతున్నాయి. ఆల్‌రౌండర్లు నాట్ సీవర్, హేలీ మాథ్యూస్‌లతో ముంబై టీమ్ స్ట్రాంగ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ముంబైపై ఢిల్లీదే ఆధిపత్యం. కాగా మ్యాచ్ రా.8.00 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లలో లైవ్ చూడవచ్చు.
News March 15, 2025
మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.
News March 15, 2025
స్టేషన్ ఘనపూర్: సీఎం సభ స్థలాలను పర్యవేక్షించిన కలెక్టర్

ఈనెల 16న ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం శివునిపల్లి శివారులో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యవేక్షించారు. ముందుగా హెలీ ప్యాడ్, సభా స్థలికి సంబంధించిన, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.