News March 24, 2024

నెల్లూరు: గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ జి.మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గండిపాలెం(బాలురు), నెల్లూరు(బాలురు), ఆత్మకూరు(బాలికలు), తుమ్మలపెంట (బాలికలు) లో 5 వ తరగతి, 6,7,8 తరగతులలో మిగిలిన ఉన్న ఖాళీలభర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ నెల 31వ తేదీలోపు https://aprs.apcfss.in లో దరఖాస్తుచేసుకోవాలన్నారు.

Similar News

News March 31, 2026

పెంచలకోనలో ఘనంగా పవిత్రోత్సవాలు

image

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉదయం 8.00లకు విశేష పూజలు, అగ్నిరాధన ఉ.10.00లకు స్నపన త్రిమంజనం, సా.5.00 లకు విశేష పూజలు, వేద పండితులు మంగళ వాయిద్యాలు నడుమ ఘనంగా నిర్వహించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ప్రసాదాలను స్వీకరించారు.

News March 31, 2026

CM పర్యటన ఏర్పాట్లపై నెల్లూరు కలెక్టర్ పరిశీలన

image

CM చంద్రబాబు ఏప్రిల్ 1న (బుధవారం) వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, జేసీ పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 31, 2026

నెల్లూరు GGH లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో NRHM విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను ఒక్క సంవత్సర కాలపరిమితిపై కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ పోస్టు, ఇద్దరు నర్పులు, ఇద్దరు వార్డు బాయ్స్, ముగ్గురు కౌన్సిలర్స్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 9వ తేదీలోపు సర్వజన ఆస్పత్రిలో అందజేయాలని కోరారు.