News March 15, 2025
VZM: జిల్లాకు ప్రత్యేకాధికారి రాక

ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణ చేసే నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు నియమించిన ప్రత్యేక అధికారి అహ్మద్ బాబు శనివారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
Similar News
News March 15, 2025
VZM: ఇంకా ఒక్కరోజే టైం.. ALL THE BEST

పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST
News March 15, 2025
నేడే విజయనగరంలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్‌వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It
News March 14, 2025
VZM: మఫ్టీలో రంగంలోకి దిగిన శక్తి టీమ్స్

విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించారు. మఫ్టీలో వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, యాప్ పనితీరు పట్ల అవగాహన కల్పించారు. మహిళలతో యాప్ డౌన్‌లోడ్ చేయించారు.