News March 15, 2025
వనపర్తి: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ ఓపెన్.
Similar News
News March 1, 2026
ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్‌లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్‌లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.
News March 1, 2026
పోకో, రెడ్‌మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్‌లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్‌మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్‌ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.
News March 1, 2026
నెలకు రూ.74వేల జీతం.. NPCILలో ఉద్యోగాలు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(<


