News March 15, 2025

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పవన్ పాత్ర కీలకం: కొణతాల

image

స్వార్థం అనేది లేకుండా రాజకీయాలు చేసే వ్యక్తి పవన్ అని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. ‘రాజకీయం లేకుండా సినిమాల్లో ఉండి ఉంటే ఎన్ని కోట్లు సంపాదించే వారో? కానీ ప్రజల కోసం పవన్ రాజకీయాల్లోకి కొనసాగారు. 11 ఏళ్లు నిర్విరామంగా పోరాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగడంతో పవన్ కీలక పాత్ర పోషించారు. నిస్వార్థమైన పవన్ లాంటి వ్యక్తిని కాపాడుకోవాలి’ అని చిత్రాడలోని జనసేన ఆవిర్భావ సభలో అన్నారు.

Similar News

News February 28, 2026

కన్నడ భాష తెలిసిన పోలీసు సిబ్బందికై లేఖ: SP

image

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో విధులు నిర్వర్తించేందుకు కన్నడ భాష తెలిసిన పోలీస్ సిబ్బందిని కర్నూలు జిల్లా నుంచి రప్పించేందుకు ఇప్పటికే లేఖ రాసినట్లు SP సునీల్ షోరాణ్ వెల్లడించారు. శ్రీశైలంలో ఉగాది ఉత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. భక్తుల రద్దీని బట్టి 6వ తేదీ నుంచి వాలంటీర్లను నియమించే అంశంపై చర్చలు జరిపామని, భక్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.

News February 28, 2026

ఎడపల్లి: క్రీడలు జీవితంలో ఎంతో ముఖ్యం: జిల్లా జడ్జి

image

క్రీడలు మన జీవితంలో ఎంతో ముఖ్యమని NZB జిల్లా జడ్జి భరత లక్ష్మీ అన్నారు. సీపీ XI టీం వర్సెస్ జ్యూడిషియల్ XI టీం జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌లో జ్యూడిషియల్ టీం విజయం సాధించింది. జడ్జి మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. పోలీస్ శాఖ, న్యాయ విభాగం సభ్యులు నిత్యం ఎంతో బిజీగా విధుల్లో ఉంటూ తమ సమయం కేటాయించి క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.

News February 28, 2026

అమెరికాతో ఢీ.. ఇరాన్‌కు ఎందుకింత ధైర్యం?

image

మోస్ట్ పవర్‌ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న US, ఇజ్రాయెల్‌తో ఇరాన్ ఢీ అంటే ఢీ అంటోంది. తమ ఆయుధ సంపత్తితో పాటు మిత్రపక్షాల బలమే దీనికి కారణం. హమాస్, హెజ్బోల్లా, హౌతీ, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌తో పాటు ఇరాక్‌లోని కొన్ని గ్రూపులూ మద్దతు ఇస్తున్నాయి. రష్యా, చైనా కూడా ఆ దేశానికి అండగా నిలుస్తున్నాయి. ఇక ఆసియాలో ఇరాన్‌కు పాక్ మిత్రదేశంగా ఉంది. కానీ USను ఎదురించి ఆ దేశానికి మద్దతిచ్చే ధైర్యం పాక్‌కు లేదు.