News March 15, 2025
పార్వతీపురం: ‘మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు’

మహిళలు, చిన్నారుల రక్షణకు శక్తి టీంలు ఏర్పాటు చేశామని ఎస్పీ ఎస్. వి మాధవ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం శక్తి టీం వాహనాలను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఐదుగురు సభ్యులతో మూడు బృందాలుగా 15మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేసామన్నారు. శక్తి యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రత్యేకంగా జిల్లాలో శక్తి టీమ్స్‌ను నియమించామన్నారు.
Similar News
News March 15, 2025
వాళ్లకు కరెంట్, నీళ్లు కట్: సీఎం రేవంత్ హెచ్చరిక

TG: రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు CM రేవంత్ అన్నారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారి ఇళ్లకు కరెంట్, నీళ్లు కట్ చేస్తామని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల విషయంలో ఎంతపెద్ద వారున్నా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఫాంహౌస్‌లలో డ్రగ్స్ పార్టీలపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నామని వెల్లడించారు. కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వివరించారు.
News March 15, 2025
నీటి కుంటలో పడి ఇద్దరు బాలికల మృతి

అనంతపురం జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గార్లదిన్నె మండలం కల్లూరు గ్రామ సమీపంలో సంచారాలు చేసేవారు నివాసం ఉంటున్నారు. అయితే ఎద్దులు మేపేందుకు ఇద్దరు బాలికలు వెళ్లారు. ఎడ్లు పెన్నా నదిలో దిగి నీరు తాగుతుండగా.. వాటిని బయటకు తోలే ప్రయత్నంలో ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. మృతులు కల్లూరుకి చెందిన లక్ష్మి(10), హరిణి(12)గా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు.
News March 15, 2025
క్రోమ్ యూజర్లకు అర్జెంట్ వార్నింగ్!

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను తక్షణమే అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. అందులో రెండు వల్నరబిలిటీస్ను గమనించామని CERT-In తెలిపింది. లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ అవ్వకపోతే రిమోట్ ఏరియాస్ నుంచి సైబర్ క్రిమినల్స్ అటాక్ చేసేందుకు అవకాశముందని తీవ్ర వార్నింగ్ ఇచ్చింది. ఒక ఆర్బిట్రారీ కోడ్‌ను పంపించి మోసగించొచ్చని, వ్యక్తిగత సమాచారం దొంగిలించొచ్చని వెల్లడించింది.