News March 15, 2025
నంద్యాల: అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు

నంద్యాలలో అధిక ధరలకు స్టాంపుల విక్రయాలు జరుగుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. రూ.100 స్టాంప్ రూ.300 విక్రయాలు చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని తెలిపారు. ఇందులో కామన్ సర్వీస్ స్టాంప్ సెంటర్లు, స్టాంప్ వెండర్లు కీలక పాత్ర వహిస్తున్నారు. ఒక రింగుగా మారి అందరూ ఒకటే ధరలకు విక్రయాలు చేస్తున్నారని, ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు మాత్రం శూన్యమని వినియోగదారులు తెలిపారు.
Similar News
News March 15, 2025
చిత్తూరు: వైసీపీ అనుబంధ విభాగాల నియామకం

చిత్తూరు జిల్లాకు చెందిన పలువురికి వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాలలో చోటు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ విభాగం స్టేట్ జోనల్ అధ్యక్షునిగా షఫీ అహ్మద్ ఖాద్రి, కార్యదర్శులుగా అబ్బాస్, మహీన్, జాయింట్ సెక్రటరీలుగా సర్దార్, నూర్, ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీగా భాస్కర్ రెడ్డి, సెక్రటరీగా యుగంధర్ రెడ్డి నియమితులయ్యారు.
News March 15, 2025
తూ.గో: నేటి నుంచి ఒంటిపూట బడులు

నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నామని డీవీఈవో కె.వాసుదేవరావు తెలిపారు. పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 1.15గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మిగతా పాఠశాలల్లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందన్నారు. ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
News March 15, 2025
ATP: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మండల పరిధిలోని నాయకునిపల్లి గ్రామానికి చెందిన మునిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్‌కు ఉన్న మెయిన్ లైన్ నుంచి వచ్చే హెడ్ ఫీజులు కట్ కావడంతో వేసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో విద్యుత్తు ప్రవహించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.