News March 15, 2025
RRR, పుష్ప ఫలితాలపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

కథ బాగా చెప్తే ఏ భాషలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా సినిమా ఆడుతుందని హీరో మంచు విష్ణు నమ్మకం వ్యక్తం చేశారు. బాహుబలి, RRRలే సినిమాలే అందుకు ఉదాహరణ అని చెప్పారు. RRR సినిమాలోని అల్లూరి, కొమురంభీం గురించి తెలుగు వారికి తప్ప ఎవరికీ తెలియదని కథ చెప్పే విధానం వల్లే సూపర్ హిట్‌గా నిలిచాయన్నారు. అదే కారణంతో పుష్ప సినిమా కూడా తెలుగులో కంటే హిందీలో పెద్ద హిట్ అయిందని అని చెప్పారు.
Similar News
News April 18, 2026
నాడు శ్రీకాకుళం కలెక్టర్.. నేడు స్టేట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి, ఉత్తమ కలెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ చంద్ర పునేఠా నేడు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. 1993-96 మధ్యకాలంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి సీఎస్ స్థాయికి చేరారు. ప్రస్తుతం విజిలెన్స్ కమిషనర్‌గా ఉన్న ఆయన్ని రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా నియమించింది.
News April 18, 2026
యురేనియం ఇచ్చే ప్రసక్తే లేదు: ఇరాన్

శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎక్కడికీ తరలించబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అవి ఎప్పటికీ తమ నియంత్రణలోనే ఉంటాయని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ తెలిపారు. యురేనియంను ఇచ్చేందుకు ఇరాన్ ఒప్పుకుందని అమెరికా అధ్యక్షుడు <<19670282>>ట్రంప్<<>> చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఈ అంశం ఎన్నడూ ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడంపైనే చర్చలు కేంద్రీకృతమయ్యాయని చెప్పారు.
News April 18, 2026
ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు.. ప్రతిపక్షాలపై పవన్ విమర్శలు

LSలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి చట్టసభల్లో మహిళా శక్తిని పెంపొందించే అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయని AP Dy.CM పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఈ బిల్లును LS ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను జనసేన స్వాగతించినట్టు చెప్పారు. అయితే ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేదన్నారు. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్టసభల్లో సముచిత స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


