News March 15, 2025

మార్చి15: చరిత్రలో ఈరోజు

image

*1493: మెుదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్
*1564: జిజియా పన్ను రద్దు
*1934: బీఎస్‌పీ పార్టీ స్థాపకుడు కాన్షీరాం జననం
*1937: తెలుగు సాహితి విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
* 1950: ప్రణాళిక సంఘం ఏర్పాటు
*1983: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం
*1990: సోవియట్ యూనియన్ మెుదటి అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక

Similar News

News March 15, 2025

ఏపీఈఏపీ సెట్‌కు దరఖాస్తులు ప్రారంభం

image

ఏపీఈఏపీ సెట్ 2025కు శనివారం నుంచి ఏప్రిల్ 24వరకూ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఛైర్మన్ ప్రసాద్ ప్రకటించారు. అపరాధ రుసుము రూ10,000 చెల్లింపుతో మే16 వరకూ అప్లై చేసుకోవచ్చన్నారు. మే19-27 వరకూ ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయి. JNTU వర్సిటీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.

News March 15, 2025

భద్రాద్రి సీతారామ కళ్యాణ మహోత్సవ పనులు ప్రారంభం

image

TG: భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు మెుదలయ్యాయి. శుక్రవారం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా అర్చకులు రోలు రోకలికి పూజచేసి పసుపు కొమ్ములు దంచారు. బియ్యాన్ని తలంబ్రాలుగా చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘భద్రాచలం టెంపుల్ ఇన్‌ఫర్మేషన్’ యాప్‌ను ఈవో ఆవిష్కరించారు. యాప్ సేవలు పదిరోజుల్లో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

News March 15, 2025

తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ, రేపు క్యూలైన్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించనున్నారు. ఎల్లుండి నుంచి టీటీడీ, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు గాయపడినవారిని విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 17న విచారణకు రావాలని కలెక్టర్‌తో పాటు ఎస్పీ, టీటీడీ ఈవోకు నోటీసులు పంపారు.

error: Content is protected !!