News March 15, 2025
MLAలు రూ.800కోట్లు డిమాండ్ చేస్తున్నారు: DK శివకుమార్

బెంగళూరులో చెత్త సంక్షోభంపై వివిధ పార్టీల ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని Dy.CM DK శివకుమార్ ఆరోపించారు. సిటీ ఎమ్మెల్యేలంతా కలసి సిటీ డెవలప్‌మెంట్ ఫండ్ నుంచి రూ.800 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్లంతా సిండికేట్‌గా మారి సాధారణ ధరల కంటే 85శాతం అధికంగా కోట్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కోర్టును ఆశ్రయించారన్నారు.
Similar News
News March 15, 2025
‘కోర్టు’ సినిమాలోని ఈ అమ్మాయి ఎవరు?

నిన్న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ‘కోర్టు’ మూవీలో ‘జాబిలి’ క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇంతకీ ఆమె ఎవరు? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆ అమ్మాయి పేరు ‘శ్రీదేవి అపళ్ల’. స్వస్థలం కాకినాడ. ఆమెను ఓ ఇన్‌స్టా రీల్‌లో చూసిన డైరెక్టర్ రామ్ జగదీశ్ ఫ్రెండ్ యువరాజ్ ఆమెను ఆడిషన్‌కు రిఫర్ చేశారు. అలా కోర్టు మూవీలో ఛాన్స్ వచ్చినట్లు శ్రీదేవి తెలిపారు.
News March 15, 2025
టెస్టు క్రికెట్‌కి ‘హ్యాపీ బర్త్ డే’

టెస్టు క్రికెట్ మొదలై నేటికి 148ఏళ్లు పూర్తయింది. 1877, మార్చి 15న ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆ దేశానికి, ఇంగ్లండ్‌కు మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఆల్ఫ్రెడ్ షా(ENG) తొలి బంతి వేయగా, ఛార్ల్స్ బ్యానర్‌మ్యాన్(AUS) ఆడారు. ఆయనే తొలి టెస్టు పరుగు, తొలి సెంచరీ చేశారు. తొలి వికెట్‌ను అలాన్ హిల్(ENG) తీశారు.
News March 15, 2025
షాకింగ్.. పెళ్లయిన వారిలోనే ఆ సమస్య ఎక్కువ

పెళ్లికి ముందుతో పోలిస్తే తర్వాతే మగవాళ్లు లావెక్కుతారని పొలాండ్‌లోని వార్సాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు తేల్చారు. మహిళల్లో ఇది 39 శాతమే ఉంటుందని చెప్పారు. సింగిల్స్‌తో పోలిస్తే పెళ్లయిన పురుషుల్లో ఊబకాయం సమస్యను మూడు రెట్లు పెంచుతుందని అధ్యయనంలో తెలిపారు. తినే ఆహార పరిమాణం పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వంటివి కారణాలుగా అభిప్రాయపడ్డారు.