News March 15, 2025
NZB: గ్యాస్ స్టవ్ పేలి వాచ్‌మెన్ మృతి

నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్‌లో నాలుగేళ్లుగా వాచ్‌మెన్‌గా పని చేసే కోట్ల అనంత్(52) ఈ నెల 6న టీ పెట్టుకునేందుకు స్టవ్ ముట్టించగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శుక్రవారం చికిత్స పొందుతూ అనంత్ మృతి చెందినట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా దిబ్బిడి గ్రామం అని పోలీసులు తెలిపారు.
Similar News
News March 11, 2026
నవీపేట్: పాఠాలు బోధించిన కలెక్టర్

నవీపేట మండలం మోకన్ పల్లిలో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 10వ తరగతి క్లాస్ రూంను కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం సందర్శించి, విద్యార్థినులకు పాఠాలు బోధించారు. పలు ప్రశ్నలు వేస్తూ వారి బోధనా సామర్థ్యాన్ని పరిశీలించారు. చక్కగా చదువుకుని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే నిర్లక్ష్యం చేయవద్దన్నారు.
News March 11, 2026
జాకోరలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని జాకోరలో విద్యుత్ షాక్‌తో గుట్టమీది గంగాధర్ (36) అనే రైతు మృతి చెందారు. బుధవారం ఉదయం తన వ్యవసాయ పొలం వద్ద కేబుల్ వైర్ సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై వర్ని ఎస్సై వంశీకృష్ణ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
News March 11, 2026
MP అర్వింద్ ఆతిథ్యం అద్భుతం: నారా లోకేశ్

నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆతిథ్యం అద్భుతమని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఓ సమ్మిట్ కోస ఢిల్లీ వెళ్లిన లోకేశ్‌ను అర్వింద్ తన ఇంటికి ఆహ్వానించారు. “అద్భుతమైన భోజనం, అంతకు మించిన మంచి స్నేహంతో గడిపిన సమయం చిరస్మరణీయం. మీ ఆత్మీయత నిజంగా స్ఫూర్తిదాయకం, మీ అభిమానిగా మారిపోయాను” అంటూ విందులో పాల్గొన్న లోకేశ్ తన సంతోషాన్ని పంచుకున్నారు.


