News March 15, 2025

NGKL: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

image

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్‌. SHARE IT

Similar News

News December 25, 2025

ఇకపై ‘కామెలియా సినెన్సిస్’ ఆకులతో చేసేదే టీ!

image

కేవలం ‘కామెలియా సినెన్సిస్’ (టీ మొక్క శాస్త్రీయ నామం) ఆకులతో చేసే డ్రింక్‌ను మాత్రమే ‘Tea’ అనాలని FSSAI స్పష్టం చేసింది. హెర్బల్ టీ, ఫ్లవర్ టీ లేదా రూయిబోస్ టీ వంటి డ్రింక్స్‌కు ‘టీ’ అనే ట్యాగ్ వాడటం తప్పుదోవ పట్టించడమే అవుతుందని తెలిపింది. ఇకపై ఇలాంటి డ్రింక్స్‌ను ‘Tea’గా కాకుండా ఇతర పేర్లతో విక్రయించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.

News December 25, 2025

పలమనేరు: వాట్సప్‌లోనే RTC బస్ టికెట్స్ బుకింగ్

image

APSRTC టికెట్ బుకింగ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసిందని పలమనేరు ఆర్టీసీ డిపో మేనేజర్ అల్తాఫ్ తెలిపారు. ఇకపై ఎవరైనా బస్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే కౌంటర్ల వద్ద నిలబడే అవసరం లేదన్నారు. 95523 00009 నంబర్‌ ద్వారా సులభంగా టికెట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ప్రయాణికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 25, 2025

క్యాలెండర్‌ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ క్రిస్మస్‌ సందర్భంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఏసుప్రభువును ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయమ్మ, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.