News March 15, 2025
వనపర్తి: ఒంటిపూట బడులు.. ఒక్కో క్లాస్ ఎంతసేపంటే..?

నేటి నుంచి ఒంటిపూట బడుల నేపథ్యంలో ఒక్క క్లాస్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనే వివరాలను ఆయా జిల్లాల అధికారులు వెల్లడించారు. ఉదయం 8 గం.లకు 1వ బెల్, 8:05కు 2వ బెల్, 8:15- 8:55 వరకు 1వ పీరియడ్, 8:55- 9:35 వరకు 2వ పీరియడ్, 9:35- 10:15 వరకు 3వ పీరియడ్, 10:15- 10:30 గంటలకు బ్రేక్. 10:30 గం. నుంచి 11:10 వరకు 4వ పీరియడ్, 11:10 గం. నుంచి 11:50 వరకు 5వ పీరియడ్, 11:50 గం. నుంచి 12:30 వరకు చివరి పీరియడ్. SHARE IT
Similar News
News November 11, 2025
రాష్ట్ర ఉత్సవంగా జగన్న తోట ప్రబల తీర్థం..!

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో జగ్గన్న తోట ప్రభలతీర్థానికి ఎంతో పేరుంది. కనుమ రోజు 11 గ్రామాల నుంచి ఊరేగింపుగా ప్రభలు తీసుకొస్తారు. ఈ అపురూపమైన దృశ్యాలను చూడటానికి వేలాది మంది వస్తారు. దీంతో ప్రబల తీర్థాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఇదే విషయమై CM చంద్రబాబును టీడీపీ నాయకురాలు తేజస్వి పొడపాటి కలిసి వినతిపత్రం ఇచ్చారు. త్వరలోనే అధికారికంగా శుభవార్త వస్తాదని ఆమె చెప్పారు.
News November 11, 2025
సదరమ్ సర్టిఫికెట్ల మంజూరుకు రూ.2 కోట్ల వసూళ్లు?

జిల్లాలో దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు జారీ చేసే విభాగంలో భారీ అవినీతి జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైకల్య శాతాన్ని పెంచేందుకు ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.20-40 వేల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. నలుగురు ఉద్యోగులు బృందంగా ఈ అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఉద్యోగులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దివ్యాంగుల నుంచి వసూళ్లకు పాల్పడటమేంటని జిల్లా వాసులు మండిపడుతున్నారు.
News November 11, 2025
NGKL: ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రమేష్ ఎన్నిక

నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న K.రమేష్, స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. అలాగే, సీపీఎస్ రద్దు చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నికను జిల్లా సంఘం నేతలు హర్షించారు.


