News March 15, 2025
తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఇవాళ, రేపు క్యూలైన్ల నిర్వహణ తీరును ఆయన పరిశీలించనున్నారు. ఎల్లుండి నుంచి టీటీడీ, పోలీసు, రెవెన్యూ సిబ్బందితో పాటు గాయపడినవారిని విచారించనున్నారు. ఇప్పటికే ఈ నెల 17న విచారణకు రావాలని కలెక్టర్‌తో పాటు ఎస్పీ, టీటీడీ ఈవోకు నోటీసులు పంపారు.
Similar News
News March 16, 2025
విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగికదాడి.. వీడియోలు వైరల్

విద్యార్థినుల పాలిట గురువే కీచకుడిగా మారాడు. యూపీ హథ్రాస్‌లోని పీజీ కాలేజీ ప్రొఫెసర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.
News March 16, 2025
SRH: ఈసారి 300 పక్కా.. తగ్గేదేలే!

IPL 2025 కోసం SRH సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచులు మొదలుపెట్టింది. ఈ మ్యాచుల్లో జట్టు ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. SRH-A ఆటగాళ్లు అయితే 5.4 ఓవర్లలోనే 100 పరుగులు బాదేశారు. ఈ జోరు చూస్తుంటే ఈసారి కచ్చితంగా 300 పరుగులు దాటిస్తారని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా గత సీజన్లో RCBపై SRH 287/3 పరుగులు చేసి IPL చరిత్రలోనే హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
News March 16, 2025
రేపు క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలకనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని అమరావతిలో సీఆర్డీఏ చేపట్టనున్న 22 పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని సమాచారం. ఇంకా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.