News March 15, 2025

బాపట్ల జిల్లాలో ఒంటిపూట బడులు: DEO

image

బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు నేటి నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. SSC పరీక్షా కేంద్రాలుగా కేటాయించిన పాఠశాలలు మాత్రం పరీక్షలు పూర్తయ్యే వరకు మధ్యాహ్నం 1 గంటల నుంచి 5గంటల వరకు బడి నిర్వహించాలన్నారు.

Similar News

News March 20, 2026

TODAY HEADLINES

image

☛ ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
☛ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN
☛ రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
☛ తెలంగాణలో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన సీఎం రేవంత్, చిరంజీవి, కమల్ తదితరులు
☛ కవిత రాజకీయ పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
☛ కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ
☛ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 1/2

image

కేరళంలో పాగా వేయాలని ఈసారి ప్రధాన కూటములు LDF, UDFతో పాటు BJP కూడా శ్రమిస్తోంది. పెరుగుతున్న ఓట్ షేర్‌ను సీట్లుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.57%గా ఉన్న BJP షేర్ 2021లో 11.30%కు పెరిగింది. అప్పుడు NDAకి 2.55% తగ్గి 12.41% వచ్చినా వ్యక్తిగతంగా BJPకి ప్లసే అయింది. 2024 LS పోల్స్‌లో NDAకి 19.24% వచ్చింది. ఇందులో ఒక్క బీజేపీకే 16.68% (3.68%+) వచ్చింది. <<-se>>#Elections2026<<>>

News March 20, 2026

కేరళంపై కమలం గురి – 2/2

image

ఇక తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విక్టరీతో బీజేపీకి బూస్ట్ దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాసర్‌గోడ్, పాలక్కడ్, నెమోమ్ సహా 9 స్థానాల్లో BJP రన్నరప్‌గా నిలిచింది. ఈసారి పార్టీ వీటిపై దృష్టి పెడితే కేరళంలో పాగా ఈజీ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ను తిప్పుకోవాలన్న ప్రయత్నాలు సక్సస్ అయితే కేరళంలో ఈసారి బీజేపీ ఇంపాక్ట్ కనిపిస్తుందని అంటున్నారు. <<-se>>#Elections2026<<>>