News March 15, 2025

సిద్దిపేట: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్ 23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ-ఓపెన్.

Similar News

News March 16, 2026

KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఏప్రిల్-2026 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. BA, B.Com, B.Sc, BBA, BCA, B.Voc, BHM & CT తదితర కోర్సుల II, IV, VI సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్‌లాగ్) అలాగే I, III, V సెమిస్టర్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4 వరకు, రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించాలి.

News March 16, 2026

ప.గో: మొదటి పరీక్షకు 371 గైర్హాజరు

image

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.

News March 16, 2026

HYD: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు HYD కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT