News March 15, 2025

మండపేట: రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని మింగేసింది

image

TPG హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం మృతి చెందింది. మండపేటకు చెందిన బోగిళ్ల సురేన్(39) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన భార్య నవ్య36), కుమార్తె వాసవీ కృష్ణ(4), వారి బంధువు శ్రీరమ్యతో కలిసి కారులో మండపేట బయలుదేరారు. కుంచనపల్లి వచ్చేసరికి కారు హైవేపై పనులు చేస్తున్న లారీని ఢీకొట్టింది. ముగ్గురు చనిపోగా మరొకరికి గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు CI రమేష్ తెలిపారు.

Similar News

News September 17, 2025

భీమదేవరపల్లి: విష జ్వరంతో చిన్నారి మృతి

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారి విష జ్వరంతో మృతి చెందింది. నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చిన్నారి మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 17, 2025

నిర్మల్: ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది..!

image

సూర్యాస్తమయ సమయంలో ప్రకృతి సంతరించుకునే రంగులు ముచ్చట గొలుపుతాయి.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. బుధవారం సంధ్య వేళ సూర్యుడు అస్తమిస్తుండగా ఏర్పడిన అరుణవర్ణం చూపరులకు ఆహ్లాదం పంచింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి ప్రధాన రోడ్డు పక్కన నుంచి వెళ్తుండగా టెంబుర్ని పెద్ద చెరువు మీదుగా కనిపించిన ఈ దృశ్యం చూసే వారికి ఆహ్లాదం పంచింది.

News September 17, 2025

నిజాంసాగర్: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

image

నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సమీపంలోని నాగమడుగు వద్ద మంజీర నదిలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. బంజపల్లికి చెందిన వడ్ల రవి(42) నాగమడుగు ప్రాంతంలో కాలకృత్యాల కోసం వెళ్లాడు. అయితే, వరద నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.