News March 15, 2025
మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News March 15, 2025
BREAKING: ఉప్పల్ సమీపంలో రోడ్డుప్రమాదం

డీసీఎం, బైక్ ఢీకొనటంతో ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఉప్పల్ భగాయత్ పరిధి ఫైర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. ఉప్పల్ నుంచి నాగోల్ వైపు భగాయత్ మీదుగా వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్‌పై ప్రయాణిస్తూ వెళుతుండగా వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టినట్లు అక్కడి వారు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
News March 15, 2025
బుమ్రాను ఆడగలననుకోవడం నా అమాయకత్వం: ఆస్ట్రేలియా బ్యాటర్

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌స్వీనీ ప్రశంసలు కురిపించారు. బుమ్రాను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. ‘ఆయన బౌలింగ్‌లో కష్టపడ్డానన్నది చాలా చిన్నపదం. బుమ్రా అత్యద్భుతమైన బౌలర్. అందరు బౌలర్లలా ఆయన్ను ఆడేయొచ్చని నేను అమాయకంగా పొరబడ్డా. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే, బుమ్రా బౌలింగ్‌ను నాలాగే ఇతర బ్యాటర్లు కూడా ఆడలేకపోయారన్నది ఒక్కటే స్వల్ప ఊరట’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.