News March 15, 2025

KMM: ఏడాదిలో 16మంది ఏసీబీకి చిక్కారు..!

image

ఉమ్మడి ఖమ్మంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. ఏడాదిలో దాదాపు 16 మంది అధికారులు ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, ఆఖరికి రూ.1500కు కూడా కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా ఎంత నడుస్తోందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం విషయంలో ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ సూచిస్తున్నారు.

Similar News

News March 19, 2026

గ్యాస్, క్రూడ్ డేటా ఇవ్వండి.. ఆయిల్ కంపెనీలకు కేంద్రం ఆదేశం

image

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చమురు, గ్యాస్ కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతులకు సంబంధించిన డేటాను తమకు ఇవ్వాలని ఆదేశించింది. దీని ఆధారంగా సప్లై చెయిన్‌ను మరింత సమర్థంగా పర్యవేక్షించడమే లక్ష్యమని పేర్కొంది.

News March 19, 2026

ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ నిజం కాదా?

image

ఇరాన్ 2 వారాల్లోనే న్యూక్లియర్ బాంబ్ తయారు చేసే అవకాశం ఉన్నందునే Feb 28న దాడులు చేశామని ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే US మాజీ కౌంటర్ టెర్రరిజం చీఫ్ కెంట్ ఈ వాదనను కొట్టిపారేశారు. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీని నిషేధిస్తూ గతంలో జారీ చేసిన ‘ఫత్వా’ను ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేదన్నారు. ఖమేనీ హత్య ఇరాన్‌ను మరింత రెచ్చగొట్టిందని, ఈ దాడుల వల్ల శాంతి నెలకొనే అవకాశం లేదని పేర్కొన్నారు.

News March 19, 2026

అమలాపురం: కలెక్టరేట్‌లో ఉగాది వేడుకలు

image

అమలాపురం కలెక్టరేట్‌లో గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలకు నాంది పలుకుతుందని సమగ్ర శిక్ష ఏపీసీ, ఆర్డీవో జి మమ్మీ పేర్కొన్నారు. వేద పఠనం, పంచాంగ శ్రవణం నిర్వహించిన వేద పండితులను అధికారులు అధికారికంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు.