News March 15, 2025
గుర్రంపూడ్: గ్రూప్-3లో మెరిసిన కానిస్టేబుల్

గుర్రంపూడ్ మండలం కొప్పోల్ గ్రామానికి శంకర్ గ్రూప్ -3లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సివిల్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూపు-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూపు-2 ఫలితాలలో 674వ ర్యాంక్, గ్రూప్ -3 ఫలితాలలో 165వ ర్యాంకు సాధించాడు. దీంతో శంకర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి
Similar News
News July 10, 2025
NLG: ‘ఎంపీడీవోలు పనితీరును మెరుగు పరచుకోవాలి’

అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం నల్గొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామ పంచాయతీలదేనని అన్నారు.
News July 10, 2025
NLG: మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు

ఉమ్మడి జిల్లాలో ఉపాధి హామీ సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న ఎఫ్ఏలు, టీఏలు, ఈసీలు, కంప్యూటర్ ఆపరేటర్లకు మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు.
News July 10, 2025
NLG: పక్షం రోజుల్లో కమిటీల పూర్తి.. పనిచేసే వారికే ఛాన్స్

జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది. డీసీసీ అధ్యక్షుల నియామకం కంటే ముందే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మండల, గ్రామ కమిటీలను నియమించాలని పీసీసీ నిర్ణయించింది. గ్రామాలు, మండలాల కమిటీలను నియమిస్తారు. గ్రామ, మండల స్థాయిలోనూ పార్టీ కోసం పని చేసే వారినే అధ్యక్షులుగా నియమించనున్నారు. ఈ ప్రక్రియ వచ్చే 10 -15 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.