News March 15, 2025

HYD: హోలీ ఈవెంట్‌లో గొడవ.. యువకుడిపై కత్తిపోట్లు

image

పోచారం ఐటీ కారిడార్‌లో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బాధితుడి వివరాలిలా.. హొలీ ఈవెంట్‌లో ఉప్పు ఆదిత్య అనే యువకుడితో కొంతమందికి గొడవ జరిగింది. అనంతరం అతను బొడుప్పల్ వెళ్తూ నారపల్లి వద్ద ఆగాడు. బైక్‌పై వచ్చిన యువకులు కత్తితో దాడి చేశారు. అతణ్ని ఉప్పల్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Similar News

News January 3, 2026

ఆస్ట్రోనాట్స్‌కు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తీసేస్తారు

image

అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములకు జ్ఞాన దంతాలు, అపెండిక్స్ తొలగిస్తారట. సాధారణంగా వీటితో సమస్యలుండవు. కానీ ఇబ్బంది వస్తే త్వరగా తొలగించాలి. అందుకే.. అంతరిక్షంలో ఉండగా వీటి సమస్య వస్తే కష్టమని ముందే ఆపరేషన్ చేస్తారట. ఇటీవలే స్పేస్‌లోకి వెళ్లొచ్చిన శుభాంశు శుక్లా ఈ విషయం వెల్లడించారు. సెల్ఫ్ ట్రీట్మెంట్‌పై ట్రైనింగ్ ఇస్తారని, ఆపరేషన్లు లాంటివి మాత్రం అక్కడి జీరో గ్రావిటీలో చేసుకోలేమన్నారు.

News January 3, 2026

సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాల వైస్ ప్రిన్సిపల్‌గా డాక్టర్ నాగర్జున

image

రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ గా డాక్టర్ నాగార్జున చక్రవర్తి నియామకమయ్యారు. వైద్య కళాశాల ప్రొఫెసర్ హెచ్‌ఓడీ అనస్థీషియా డిపార్ట్మెంట్ డాక్టర్ నాగార్జున చక్రవర్తిని రాష్ట్ర డీఎంఈ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరీ వైస్ ప్రిన్సిపల్‌గా (అడ్మినిస్ట్రేటివ్ విభాగం ) నియమించారు.

News January 3, 2026

జగిత్యాల: ‘వసతి గృహాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’

image

వసతి గృహాల్లో విద్యార్థుల పట్ల బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కే.రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల వసతి గృహ ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల సంఘం-2026 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.