News March 15, 2025

అలాంటి పాత్రలు చేయాలనేది నా కోరిక: శివాజీ

image

ఎస్వీ రంగారావు, గుమ్మడి, జగ్గయ్య వంటి నటుల్లా మరుపురాని పాత్రలు చేయాలని ఉండేదని నటుడు శివాజీ అన్నారు. క్రూరమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనేది తన కోరిక అని చెప్పారు. కోర్టు సినిమాలో తన పాత్రకు వస్తున్న ఆదరణ ఆనందాన్ని ఇస్తోందన్నారు. షూటింగ్ సెట్‌లో నా అరుపులకు అంతా భయపడేవారని తెలిపారు. ప్రస్తుతం లయతో ఓ సినిమాతో పాటు ‘దండోరా’ అనే మరో చిత్రంలో చేస్తున్నట్లు వెల్లడించారు.

Similar News

News March 15, 2025

బుమ్రాను ఆడగలననుకోవడం నా అమాయకత్వం: ఆస్ట్రేలియా బ్యాటర్

image

భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా బ్యాటర్ మెక్‌స్వీనీ ప్రశంసలు కురిపించారు. బుమ్రాను ఆడటం చాలా కష్టమని పేర్కొన్నారు. ‘ఆయన బౌలింగ్‌లో కష్టపడ్డానన్నది చాలా చిన్నపదం. బుమ్రా అత్యద్భుతమైన బౌలర్. అందరు బౌలర్లలా ఆయన్ను ఆడేయొచ్చని నేను అమాయకంగా పొరబడ్డా. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. అయితే, బుమ్రా బౌలింగ్‌ను నాలాగే ఇతర బ్యాటర్లు కూడా ఆడలేకపోయారన్నది ఒక్కటే స్వల్ప ఊరట’ అని పేర్కొన్నారు.

News March 15, 2025

బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

image

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.

News March 15, 2025

ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్

image

TG: పదేపదే తాను ఢిల్లీకి వెళ్తున్నానంటూ BRS చేస్తున్న విమర్శలకు CM రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటివారే. కేంద్రం తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఏముంది? ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ప్రతి కేంద్రమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తున్నా’ అని తెలిపారు.

error: Content is protected !!