News March 15, 2025
అనకాపల్లి: ఈనెల 31తో ముగియనున్న ప్రవేశ గడువు

గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో గల గురుకుల పాఠశాలలో 5,6,7,8 తరగతులు, ఇంటర్ ప్రథమ సంవత్సరం, డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఈనెల ఒకటిన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు 31తో ముగుస్తుందని అన్నారు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 14, 2026
WGL: కార్యదర్శులకు డబుల్ ఒత్తిడి!

గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం పని భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరులోగా పన్నుల వసూళ్లు 100 శాతం పూర్తి చేయాలనే ఆదేశాలు ఒకవైపు ఉండగా, ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనా- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మరోవైపు పడింది. సర్వేలు, సమావేశాలు, నివేదికలతో పని భారం పెరిగి పన్నుల వసూళ్లు చేయడం కష్టమవుతోందని ఉమ్మడి జిల్లా కార్యదర్శులు వాపోతున్నారు.
News March 14, 2026
రాజమండ్రి: ఆగని మరణాలు.. మరో ఇద్దరు మృతి

రాజమండ్రిలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. కిమ్స్ బుల్లినేని ఆసుపత్రిలో కడలి కృష్ణారావు (75), డెల్టా ఆసుపత్రిలో రెడ్డి అనంతలక్ష్మి (55) మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
News March 14, 2026
బుకింగ్ తర్వాత గ్యాస్ రావడం లేదా? అయితే ఇలా చేయండి!

గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసిన రెండున్నర రోజుల్లో డెలివరీ కాకుంటే టోల్ ఫ్రీ నంబర్లకు ఫిర్యాదు చేయాలని డీఎస్ఓ ప్రకాశ్ రావు శనివారం తెలిపారు. ఇండేన్ వినియోగదారులు 1800-2333-555, 7718955555 నంబర్లకు, భారత్ గ్యాస్ కస్టమర్లు 1800-22-4344, 7715012345కు ఫోన్ చేయాలన్నారు. HP గ్యాస్ వారు 1800-2333-555, 9493602222 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.


