News March 15, 2025

HYD: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు

image

HYDలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం పగటి ఉష్ణోగ్రత 38.4 డిగ్రీలుగా నమోదైంది. రాత్రి ఉష్ణోగ్రత 23.6 డిగ్రీల వరకు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరిగినా గాలులు వీస్తుండడంతో ఉక్కపోత ఇంకా మొదలు కాలేదు. రానున్న రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News January 22, 2026

మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ ‘అద్దె’ తోడ్పాటు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్దె బస్సుల పథకం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 21 మండల సమాఖ్యలు నిర్వహిస్తున్న బస్సులకు ఆర్టీసీ రూ.87.52 లక్షల అద్దె చెల్లించింది. ఒక్కో బస్సుకు నెలకు సగటున రూ.69,468 ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల నిధులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుస్తోంది.

News January 22, 2026

NRPT: ఎన్నికల వేళ మహిళా సంఘాలకు వడ్డీ డబ్బుల విడుదల

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఊరట కల్పించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద పట్టణ మహిళా సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ డబ్బులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నారాయణపేటలో 427 సంఘాలకు రూ.1.40 కోట్లు, మక్తల్‌లో 123 సంఘాలకు రూ.43.70 లక్షలు, కోస్గిలో 187 సంఘాలకు రూ.65.76 లక్షలు విడుదలయ్యాయి. నిధులు విడుదల కావడంతో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది.

News January 22, 2026

జనగామ: కారు ఢీకొని యువకుడి మృతి

image

జనగామ సమీపంలోని పెంబర్తి కమాన్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సిజాహిద్ (22) అలియాస్ సిజ్జు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వెనక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.