News March 15, 2025
రాంబిల్లి: అలలకు వ్యక్తి గల్లంతు

రాంబిల్లి మండలం కడపాలెంకి చెందిన మత్స్యకారుడు మెరుగు జగన్(20) చేపలు పడుతుండగా సముద్రపు అలలకు బోటు తిరగబడి గల్లంతయ్యాడు. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. శుక్రవారం ఉదయం జెడ్.చింతవ సమీపంలో ఐదుగురితో కలిసి చేపలు పడుతుండగా బోటు తిరగబడి జగన్ గల్లంతయ్యాడు. మిగిలిన ఐదుగురు సురక్షితంగా తీరానికి చేరుకున్నారు. కుమారుడు గల్లంతయినట్లు అతని తండ్రి అచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News March 15, 2025
పరీక్షలు ప్రశాంతంగా రాయండి: KMR కలెక్టర్

ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలని ఎవరు ఒత్తిడికి లోను కావద్దని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. శనివారం ఆయన పిట్లంలో పర్యటించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం ZPHSలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అక్కడే వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
News March 15, 2025
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షకు 759 మంది గైర్హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 62,053 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 61,294 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 759 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
News March 15, 2025
NZB: రైల్వే స్టేషన్‌లో చిన్నారి MISSING

నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ SHO రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన చిన్నారి స్టేషన్‌లో కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన చిన్నారి జాడ దొరకలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.