News March 15, 2025
NZB: మనవడి బర్త్‌డే.. తాత సూసైడ్

NZBకి చెందిన రాఘవేంద్రరావు(60) HYD మియాపూర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనవడి బర్త్‌డే పార్టీ కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం షాపింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో రాఘవేంద్రరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 29, 2026
తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతం కట్.. బిల్లు పూర్తి వివరాలివే

TG: ‘ఉద్యోగుల జవాబుదారీతనం, తల్లిదండ్రుల పోషణ పర్యవేక్షణ బిల్లు, 2026’ను ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. జీతం నుంచి 15% లేదా రూ.10,000.. ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కట్ చేసి నేరుగా తల్లిదండ్రులకు చెల్లిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, MLAలు, MLCలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచుకూ ఇది వర్తిస్తుంది. తల్లిదండ్రులు కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాక 60 రోజుల్లోపు పరిష్కరించాలి.
News March 29, 2026
ఇండియాలో పాపులర్ బ్రాండ్లు.. ఫుల్ నేమ్స్

*PVR- ప్రియా విలేజ్ రోడ్‌షో
*MRF- మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ
*ITC- ఇండియన్ టొబాకో కంపెనీ
*DLF- ఢిల్లీ ల్యాండ్ & ఫైనాన్స్
*HCL- హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్
*AMUL- ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్
*OYO- ఆన్ యువర్ ఓన్
*TVS: Thirukkurungudi Vengaram Sundram
News March 29, 2026
పలువురు ఐఏఎస్‌ల బదిలీ

AP: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. కాకినాడ కలెక్టర్ షణ్మోహన్‌ను ఏపీఈడీబీ సీఈవోగా, అల్లూరి జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్‌ను ఏపీఐఐసీ ఎండీగా నియమించింది. అల్లూరి కలెక్టర్‌గా టి.నిశాంతి, విశాఖకు అభిషిక్త్ కిశోర్, గుంటూరుకు సాయికాంత్ వర్మ, కాకినాడకు హరేంద్రప్రసాద్‌ను బదిలీ చేసింది. పాఠశాల విద్య డైరెక్టర్‌గా తమిమిన్ అన్సారియాను నియమించింది.


