News March 15, 2025
చిట్యాల: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో జరిగింది. రామచంద్రపురం గ్రామానికి చెందిన సూర కుమారస్వామి(44) ఆరేళ్ల క్రితం గుంటూరుపల్లి వలస వెళ్లి నాలుగెకరాల కౌలు సాగు చేస్తున్నాడు. పంట కోసం తెచ్చిన పెట్టుబడి, బిడ్డ పెళ్లి కోసం తెచ్చిన అప్పు తీరక మనస్తాపంతో ఫిబ్రవరి 19న పురుగు మందు తాగి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 16, 2026
భద్రాద్రి: సాగునీటి విస్తరణకు ప్రాజెక్టు పనులు వేగం

భద్రాద్రి జిల్లాలో సాగునీటి విస్తరణకు కీలకమైన సీతారామ డిస్ట్రిబ్యూటరీ పనులకు అవసరమైన భూసేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భూసేకరణ పూర్తయితే ప్రాజెక్టు పనులు వేగవంతమై రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. యాతాలకుంట టన్నెల్‌లో మిగిలిన సుమారు 100 మీటర్ల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 50 వేల ఎకరాల భూమి సాగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News March 16, 2026
HYD: హైడ్రా ప్రజావాణికి 48 ఫిర్యాదులు

సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి మొత్తం 48 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఫిర్యాదుదారుల ముందే గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా పరిశీలించి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్లాట్, ఇంటి స్థలం కొనేటప్పుడు లోతుగా విచారించి అన్ని సరిగ్గా ఉంటేనే ముందుకు వెళ్లాలని సూచించారు.
News March 16, 2026
KU M.Pharmacy పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

KU M.Pharmacy మొదటి సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు మార్చి నెలలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫీజును లేట్ ఫీ లేకుండా మార్చి 28 వరకు, రూ.250 లేట్ ఫీతో మార్చి 31 వరకు చెల్లించవచ్చు. అన్ని పేపర్లకు రూ.1000, రెండు బ్యాక్‌లాగ్ పేపర్లకు రూ.500, ఒక్కో ఇంప్రూవ్‌మెంట్ పేపర్‌కు రూ.300 ఫీజుగా నిర్ణయించారు.


