News March 15, 2025
NGKL: ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్.!

బిజినేపల్లి (M) వెల్గొండకి చెందిన రమేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాలు.. వెల్గొండకి చెందిన రమేశ్ అతని స్నేహితుడు కలిసి బైక్‌పై బుద్దారం నుంచి బిజినేపల్లికి వస్తున్నారు. శాయిన్‌పల్లిలో స్పీడ్ బ్రేకర్ వద్ద బైక్ అదుపుతప్పి అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితుడికి గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఎత్తైన స్పీడ్ బ్రేకర్‌తో ప్రజల పాలిట మృత్యువుగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Similar News
News November 14, 2025
ఐపీఎల్-2026 మినీ వేలం డేట్ ఫిక్స్!

ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబీలో జరగనున్నట్లు ESPN తెలిపింది. వరుసగా మూడో ఏడాది విదేశాల్లోనే ఆక్షన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎప్పటిలాగే రోజు మొత్తం వేలం సాగే అవకాశముంది. ఈసారి అన్ని జట్లు పెద్ద మొత్తంలో ప్లేయర్లను వదులుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వేలం ఆసక్తిగా మారనుంది. మరోవైపు పలు జట్లు ఆటగాళ్లను ట్రేడ్ చేసుకుంటున్నాయి.
News November 14, 2025
కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

కామారెడ్డి జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ స్కిట్, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్ ప్లెడ్జ్, అలాగే విద్యార్థులకు పోలీస్ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.
News November 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


