News March 15, 2025
SRPT: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

ఎండ తీవ్రత పెరిగిన దృష్ట్యా శనివారం (నేడు) నుంచి సూర్యాపేట జిల్లాలో ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. పదో తరగతి ఎగ్జామ్స్ సెంటర్ స్కూల్స్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. అటు ఈనెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
Similar News
News November 4, 2025
సర్కారు వారి పాట.. ఎకరం రూ.99 కోట్లు

రూ.1,2 కోట్లు కాదు.. రూ.99 కోట్లు.. ఇదీ కోకాపేటలోని ఒక ఎకరానికి ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర. ఈ మొత్తం చెల్లిస్తే ఎకరం సొంతం చేసుకోవచ్చు అనుకుంటే పొరపాటే. దీనికి వేలం వేస్తారు. అంటే ఈ రేటు డబుల్ కావచ్చు. ఈ నెల 24, 28 తేదీలతోపాటు వచ్చేనెల 3, 5 తేదీల్లో ప్రభుత్వం ఈ-వేలం వేయనుంది. ఈ మేరకు సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కనీసం రూ.150 కోట్లైనా సంపాదించాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
News November 4, 2025
విశాఖ: గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

సీతానగరంలో నివాసం ఉండే రూపక్ సాయి ఒడిశా యువకులతో 2 రోజుల క్రితం గంగవరం సాగర్ తీరం మాధవస్వామి గుడి వద్దకు వెళ్లాడు. అక్కడ సముద్రంలో కెరటాల ఉద్ధృతికి గల్లంతైన విషయం తెలిసిందే. న్యూ పోర్ట్ పోలీసులు గాలింపు చేపట్టినా లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం మాధవస్వామి గుడి సమీపంలోనే మృతదేహం ఒడ్డుకు రావడంతో పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించి కేసు నమోదు చేశారు.
News November 4, 2025
NZB: అపార్, యూడైస్ పనులను పూర్తిచేయండి: కలెక్టర్

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విద్యా శాఖ అధికారులు, ప్రిన్సిపల్స్ సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్‌లో ఈరోజు జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. వెంటనే విద్యార్థుల అపార్, యూడైస్ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి కళాశాల ప్రిన్సిపల్ కచ్చితంగా ఆపార్, యూడైస్, పెన్ నంబర్లను విద్యార్థులకు అందజేయాలన్నారు.


