News March 24, 2024

మార్చి 24: చరిత్రలో ఈ రోజు

image

1603: క్వీన్ ఎలిజబెత్ మరణం
1882: ‘క్షయ’ కారక బాక్టీరియాను కనుగొన్న రాబర్ట్ కోచ్
1896: రేడియో ప్రసార సంకేతాలను సృష్టించిన ఏఎస్ పోపోవ్
1914: సాహితీకారుడు పుట్టపర్తి నారాయణాచార్యుల జననం
1977: భారత ప్రధానిగా ఇందిరాగాందీ పదవీవిరమణ
1998: లోక్‌సభ స్పీకర్‌గా దివంగత జీఎంసీ బాలయోగి ప్రమాణస్వీకారం
2017: క్రేన్ వక్కపొడి అధినేత గ్రంధి సుబ్బారావు కన్నుమూత
నేడు ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

Similar News

News November 2, 2024

అమ్మవారి వెండి కాయిన్స్ పంపిణీ.. భారీగా తరలివస్తున్న భక్తులు

image

TG: ఏటా దీపావళి పండుగకు HYDలోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో వెండి నాణేలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారికి భక్తులు సమర్పించిన వెండి కానుకలతో ఈ నాణేలను తయారు చేస్తారు. ఈసారి గురువారం ప్రారంభమైన కాయిన్స్ పంపిణీ రేపటి(ఆదివారం) వరకూ కొనసాగనుంది. ఈ నాణేలు లభిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. రేపు సెలవు కావడంతో భక్తులు భారీగా వచ్చే అవకాశముంది.

News November 2, 2024

ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

News November 2, 2024

రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు: సీఎం

image

AP: 10 పాలసీలతో రాష్ట్ర భవిష్యత్తు మార్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ కలెక్టరేట్‌లో మెట్రో రైలు, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2047 నాటికి ఏపీ అన్ని అంశాల్లోనూ ముందుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.