News March 15, 2025
KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ పట్టణంలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.
Similar News
News March 7, 2026
ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పే: SBI రీసెర్చ్

పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇండియా గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ‘క్రూడాయిల్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి GDP వృద్ధి 0.25% వరకు తగ్గొచ్చు. హార్ముజ్ ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే దిగుమతి ఖర్చులు భారమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు, ట్రేడ్‌పై కూడా ప్రభావం ఉంటుంది. ఇది దేశ ఎకానమిక్ స్టెబిలిటీకి ఛాలెంజింగ్‌గా మారుతుంది’ అని హెచ్చరించింది.
News March 7, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 429 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 429 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 4,378 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 3,949 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.
News March 7, 2026
కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి కావాలి: VZM కలెక్టర్

ఏకీకృత కుటుంబ సర్వే రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం మండల వారీగా కలెక్టర్ టీసీ ద్వారా సమీక్షించారు. ఎక్కువ పెండింగ్ ఉన్న మండలాల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. జిల్లా పరిషత్ సీఈవో పర్యవేక్షించాలని గంట గంటకు రిపోర్ట్ సమర్పించాలని జి.ఎస్.డబ్ల్యు కో ఆర్డినేటర్‌ను ఆదేశించారు.


