News March 15, 2025
VZM: ఇంకా ఒక్కరోజే టైం.. ALL THE BEST

పదో తరగతి పరీక్షలు ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్నాయి. విజయనగరం జిల్లాలో మొత్తం 23,765 మంది విద్యార్థులు 119 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారు. 1150 మంది ఇన్విజిలేటర్లు, 9మంది ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 36 మంది కస్టోడియన్లు, 238 మంది డిపార్టమెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష జరగనుండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవచ్చు.
ALL THE BEST
Similar News
News February 25, 2026
విజయనగరం RDO, బొబ్బిలి DSP బదిలీ

2018 గ్రూప్-1 అధికారులపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది ఆర్డీవోలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. వారిని అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఇవాళ కోర్టుకు కూడా హాజరుకావాల్సి వచ్చింది. వారిలో విజయనగరం RDO దాట్ల కీర్తి కూడా ఉన్నారు. అదే విధంగా బొబ్బిలి DSP భవ్య రెడ్డిని కూడా బదిలీ చేశారు.
News February 25, 2026
VZM: ‘వైద్యరంగంలో పరిశోధనలు పెరగాలి’

వైద్యరంగంలో పరిశోధనలను పెంచాలని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి.చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. బుధవారం విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించారు. పరిశోధనలకు రూ.50 లక్షలు, క్రీడా కార్యకలాపాలకు రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు ఈ-జర్నల్స్ సభ్యత్వం తీసుకోవాలని, ప్రతి మూడు నెలలకు పురోగతి నివేదికలు సమర్పించాలన్నారు.
News February 25, 2026
VZM: మార్చి 2న JNTU జీవీలో యూత్ పార్లమెంట్

విజయనగరం JNTU జీవీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మార్చి 2న యూత్ పార్లమెంట్ నిర్వహిస్తామని జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వీసీ ప్రొఫెసర్ సుబ్బారావు బుధవారం ఆవిష్కరించారు. 18 నుంచి 25 ఏళ్లలోపు విజయనగరం జిల్లా యువతీ, యువకులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు అన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 28 లోగా పేర్లను మైభారత్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


