News March 15, 2025

అనకాపల్లి: ‘చీరకు దీపం అంటుకుని మృతి’

image

అనకాపల్లి దాడివారి వీధిలోని ఓ ఇంట్లో అగ్ని ప్రమాదానికి గురైన వృద్ధురాలు కేజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. దీనికి సంబంధించి పట్టణ సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. భీశెట్టి జోగరత్నం ఈ నెల 10న పూజ చేస్తున్న సమయంలో చీరకు దీపం అంటుకుని అగ్నిప్రమాదానికి గురైంది. చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించగా మృతి చెందింది. ఈమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News March 28, 2026

నల్గొండ: రిజిస్ట్రేషన్ల సందడి.. రోజు 11 గంటలు సేవలు!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా రిజిస్ట్రేషన్ల రద్దీని దృష్టిలో ఉంచుకొని, ఈ నెల 28, 30, 31 తేదీల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాల పని వేళలను పొడిగించారు. ఈ మూడు రోజుల్లో ఉదయం 9:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు, అంటే రోజుకు దాదాపు 11 గంటల పాటు రిజిస్ట్రేషన్ సేవలు నిరంతరాయంగా అందుబాటులో ఉంటాయి.

News March 28, 2026

భారత్ నుంచి శ్రీలంక, బంగ్లాకు 53వేల టన్నుల పెట్రోల్, డీజిల్

image

ఇంధన సంక్షోభం వేళ శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు భారత్ అండగా నిలిచింది. శ్రీలంకకు 20వేల టన్నుల డీజిల్, 18 వేల టన్నుల పెట్రోల్ పంపింది. బంగ్లాకు 5వేల టన్నుల డీజిల్ పంపించింది. యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి 15వేల టన్నుల డీజిల్ వచ్చినట్లు బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపింది. వచ్చే నెలలో 45వేల టన్నుల డీజిల్ రానుందని పేర్కొంది. ఈ సంక్షోభ సమయంలో ఆ దేశాలకు పంపడం అవసరమా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

News March 28, 2026

జాగృతిలో చేరికలు.. కండువా కప్పి ఆహ్వానించిన కవిత

image

తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, కార్యకర్తలు సంస్థలో చేరారు. నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ సంస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.