News March 15, 2025

KMR: నేటి నుంచి ఒంటి పూట బడులు

image

జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 12:30 వరకు మాత్రమే స్కూలు ఉంటుంది. ఈ నెలలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్‌ హై స్కూల్లో పరీక్షలైన అనంతరం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూలు ఉంటుంది. వేసవి సందర్భంగా మధ్యాహ్నం వరకే క్లాసులు నిర్వహించనున్నారు.

Similar News

News September 19, 2025

కండువా కప్పుకుంటే పార్టీ మారినట్లేనా: రేవంత్

image

ఒక ప్రజా ప్రతినిధి మరొక పార్టీ జెండా కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కాసేపటి క్రితం నేను కూడా కొందరికి కండువాలు కప్పాను. ఆ కండువా ఏంటో కూడా వాళ్ళు చూసుకోకుండా కప్పించుకున్నారు’ అని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో ఉదహరించారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలు లేవని తెలిపారు. BRS ఫిర్యాదుపై స్పీకర్‌దే తుది నిర్ణయమన్నారు.

News September 19, 2025

HYD: బతుకమ్మ వేడుక.. బస్సులు సిద్ధం ఇక..!

image

బతుకమ్మ వేడుకలు.. దసరా సెలవులు త్వరలో రానుండటంతో సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. MGBS, ఆరాంఘర్, జేబీఎస్, KPHB కాలనీ, ఎల్‌బీనగర్, ఉప్పల్ క్రాస్ రోడ్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. ప్రయాణికులు వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లకు ఫోన్ చేయొచ్చు. SHARE IT

News September 19, 2025

ఈనెల 30లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించలేం: CM రేవంత్

image

TG: SEP 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఢిల్లీలో మీడియా చిట్‌చాట్‌లో CM రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఎప్పుడు నిర్వహించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈనెల 30లోపు నిర్వహించాలంటూ HC ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను HCకి వివరించి, ఏం చేయాలో కోరుతామన్నారు. CM వ్యాఖ్యలను బట్టి ఎన్నికలు ఇప్పట్లో లేనట్లేనని స్పష్టమవుతోంది.