News March 15, 2025
కౌటాల: గ్రూప్-2లో 191, గ్రూప్-3లో 349వ ర్యాంకు

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకి చెందిన <<15731264>>సాయిరాం గౌడ్ గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో<<>> సత్తా చాటాడు. నిన్న విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు విడుదలైన గ్రూప్- 2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ -1 మెయిన్స్‌లోను 436 మార్కులతో సాధించాడు. ప్రస్తుతం బెజ్జూరు మండలం మొగవెల్లి JPS విధులు నిర్వహిస్తున్నారు.
Similar News
News November 9, 2025
అమ్రాబాద్: అక్కమహాదేవి గుహలకు మరో లాంచీ ఏర్పాటు

టైగర్ రిజర్వు ఫారెస్ట్ ఏరియా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అక్కమహాదేవి గుహాల సందర్శనకు అధికారులు మరో లాంచీ ఏర్పాటు చేశారు. ఒకటే మినీ లాంచీ ఉండడంతో పర్యటకులు 3 గంటల వరకు వేచి ఉండేది. గమనించిన పర్యాటకశాఖ అధికారులు 30 మంది సామర్థ్యం గల మినీ లాంచీని దోమలపెంటకు తీసుకొచ్చారు. త్వరలోనే ప్రారంభిస్తామని పర్యాటక శాఖ జిల్లా అధికారి నరసింహ వెల్లడించారు.
News November 9, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65పై చేర్యాల గేటు వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును తుఫాన్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నారాయణఖేడ్‌కు చెందిన బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News November 9, 2025
ములుగు: బాలుడి మృతిపై వైద్యశాఖ సీరియస్..!

ములుగు(D) కన్నాయిగూడెం(M) గూరేవులకు చెందిన హరినాథ్ స్వామి(7) అనే <<18238426>>బాలుడు పాముకాటుతో<<>> శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వైద్యశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక ఆసుపత్రికి తీసుకొచ్చిన బాలుడికి యాంటీడోస్ ఎందుకు ఇవ్వలేదనేదానిపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాల్సి ఉండగా లేకపోవడంపై చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.


