News March 15, 2025
SRPT: 4 ఉద్యోగాలు సాధించిన బూర సతీష్

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని నారాయణపురం (పాలేన్నారం) గ్రామానికి చెందిన బూర సతీష్ నాలుగు ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్‌గా కలెక్టరేట్‌లో పనిచేస్తున్నాడు. గ్రూప్-2లో 206వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన గ్రూప్-3లో 316 ర్యాంకు సాధించాడు. అలాగే 2023లో రైల్వే ఉద్యోగానికి కూడా ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సతీష్‌ను పలువురు అభినందించారు.
Similar News
News March 15, 2025
రంగారెడ్డి: ఇంటర్ పరీక్షకు 759 మంది గైర్హాజరు

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 185 సెంటర్లలో 62,053 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 61,294 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 759 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారన్నారు. జిల్లావ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా నమోదు కాలేదన్నారు.
News March 15, 2025
NZB: రైల్వే స్టేషన్‌లో చిన్నారి MISSING

నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ SHO రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన చిన్నారి స్టేషన్‌లో కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన చిన్నారి జాడ దొరకలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
News March 15, 2025
బెడ్‌పై తిని పడుకుంటే రూ.4.7 లక్షల జీతం

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) బంపరాఫర్ ఇచ్చింది. 10 రోజులపాటు వాటర్ బెడ్‌పై పడుకుంటే రూ.4.7 లక్షల జీతం చెల్లిస్తోంది. వాటర్‌ప్రూఫ్ ఫ్యాబ్రిక్‌తో స్పెషల్ బాత్ టబ్‌లు తయారు చేసింది. ఇందులో పడుకునే 10 మంది వాలంటీర్లకు ఫుడ్, డ్రింక్స్, ఫోన్ అన్ని సమకూరుస్తారు. ఈ 10 రోజులూ వారు ఆ బెడ్‌పై విశ్రాంతి తీసుకోవడమే పని. స్పేస్ జర్నీలో మానవ శరీరంపై ఉండే ప్రభావాలను అంచనా వేసేందుకే ESA ఈ ప్రయోగం చేపట్టింది.