News March 15, 2025
ముత్తిరెడ్డి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో అయ్యప్ప టెంట్ హౌజ్ ఆవరణలో శుక్రవారం క్షుద్ర పూజల కలకలం రేగింది. గుర్తు తెలియని వారు టెంట్ హౌజ్ ఆవరణలో ఒక ఎర్ర బట్టలో పసుపు, ఎల్లిగడ్డ లాంటి పదార్థాలు వదిలి వెళ్లారు. గమనించిన స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని విషయాలపై అరా తీశారు.
Similar News
News July 6, 2025
రాయచోటిలో ఘోర ప్రమాదం

రాయచోటిలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి-మదనపల్లె మార్గంలోని ఇస్తిమా మైదానానికి సమీపాన ఉన్న శ్రీనివాసపురం వద్ద లారీ, ఇన్నోవా ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో మృతదేహం ఛిద్రమైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 6, 2025
పటాన్‌చెరు: మానవ అవశేషాల అప్పగింత సజావుగా జరగాలి: కలెక్టర్

సిగచీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి అవశేషాల అప్పగింత సజావుగా జరగాలని కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. పటాన్‌చెరు ఏరియా ఆసుపత్రిని ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఇప్పటివరకు 42 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. మరో 8 మంది గల్లంతవగా, వారి మృతదేహాల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
News July 6, 2025
తెలుగు విశ్వవిద్యాలయం.. పరీక్షల తేదీలు ఖరారు

తెలుగు విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పరీక్ష షెడ్యూల్ నేడు విడుదల చేశారు. BFA, బి.డిజైన్, (సెమిస్టర్-2,4,6); PG. డిప్లొమా ఇన్ యోగ, MA, MFA, MCA, MAJ &MC, ఎం.డిజైన్ (సెమిస్టర్-2) కోర్సులకు మొదటి, 2వ సెమిస్టర్ (రెగ్యులర్/ బ్యాక్ లాగ్/ఇంప్రూవ్మెంట్) పరీక్షలు జులై/ఆగస్టులో నిర్వహించనున్నారు. పరీక్ష ఫీజు ఈనెల 19న చివరి తేదీ. రూ.100 ఫైన్ తో 23 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.