News March 15, 2025
అమరావతి రాజధాని ప్రాంతంలో నేడు శ్రీవారి కళ్యాణం

రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెం TTD ఆలయం వద్ద శనివారం శ్రీవారి కల్యాణోత్సవం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తికాగా, 27వేల మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 1000 మంది పోలీసుల బందోబస్తుతో, 5 డ్రోన్లు, 70 సీసీ కెమెరాలు పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంచారు. హాజరైన ప్రతి భక్తునికి 175 గ్రాములో లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నారు. మీరు వెళుతున్నారా కామెంట్ చేయండి.
Similar News
News April 1, 2026
మచిలీపట్నంలో పెన్షన్లు పంపిణీ చేసిన కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని 7, 9 డివిజన్‌లలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పెన్షన్లు పంపిణీ చేశారు. పలువురు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లిన కలెక్టర్ పెన్షన్ దారులతో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ సొమ్ము సచివాలయం ఉద్యోగుల ద్వారా ఇప్పించారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు తదితరులు ఉన్నారు.
News April 1, 2026
ఏలూరు: ఖాకీ కర్కశత్వం.. విద్యార్థి చేతులు విరగ్గొట్టిన SI

జిల్లా ఎస్పీ చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి పోలీసుల్లో మార్పు రావడం లేదు. బుట్టాయిగూడెం ఎస్ఐ ఓ విద్యార్థి చేతులు విరగగొట్టారు. రెడ్డి గణపవరం తిరుణాల్లో యువకుడిని కొట్టి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెం(M) శ్రీనివాసపురం(V)కి చెందిన అఖిల్‌ను ఎస్ఐ కొట్టడంతో యువకుడికి రెండు చేతులు విరిగిపోయాయి. బాధితుడి తండ్రి ఎస్పీకి ఫిర్యాదు చేయటంతో వీఆర్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.
News April 1, 2026
వికారాబాద్: ఎందుకో నన్ను మర్చిపోయారు!

నన్ను మర్చిపోయారనుకుంటా..! అంటూ ఎర్రని పోస్ట్ బాక్స్ వాపోయింది. ఒకప్పుడు గ్రామంలోని ప్రతి ఇంటికి లేఖలను చేరవేసే మాధ్యమంగా ఉండేది. ప్రజలు తమ ఆనందాలు, విషాదాలు, కలలను ఈ చిన్న పెట్టెలో వేసి దూరాలకు పంపేవారు. కాలం మారింది. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో ఈ పోస్ట్ బాక్స్ చెట్టుకు కట్టబడి మర్చిపోయిన వస్తువులా కనిపిస్తోంది. దానిపై ఉన్న ఉత్తరములు అనే పదం మాత్రమే దాని గత వైభవాన్ని గుర్తు చేస్తోంది.


