News March 15, 2025
కాకినాడ: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తండ్రి

ఓ తండ్రి కసాయిగా మారాడు. ఇద్దరు పిల్లల్ని క్రూరంగా చంపి తాను చనిపోయాడు. పిల్లలు చదవడం లేదని కాకినాడ రూరల్‌లో ఉంటున్న చంద్రకిషోర్ (37) హోలీ సంబరాలు కుటుంబంతో చేసుకున్నాడు. భార్యను వదిలేసి పిల్లలతో ఇంటికి వచ్చాడు. జోషిత(7), నిఖిల్ (6)ని తండ్రి ఇంటికి తీసుకొచ్చి బకెట్లో తలలు ముంచి దారుణంగా చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల కోసం ఇంటికి వచ్చిన భార్య ఆ ఘటన చూసి నిర్ఘాంత పోయింది.
Similar News
News March 16, 2026
KU డిగ్రీ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ కోర్సులకు సంబంధించిన ఏప్రిల్-2026 సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. BA, B.Com, B.Sc, BBA, BCA, B.Voc, BHM & CT తదితర కోర్సుల II, IV, VI సెమిస్టర్(రెగ్యులర్/బ్యాక్‌లాగ్) అలాగే I, III, V సెమిస్టర్ బ్యాక్‌లాగ్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు లేకుండా ఏప్రిల్ 4 వరకు, రూ.50 లేట్ ఫీజుతో ఏప్రిల్ 9 వరకు తమ తమ కళాశాలల్లో చెల్లించాలి.
News March 16, 2026
ప.గో: మొదటి పరీక్షకు 371 గైర్హాజరు

జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని ప.గో డీఈఓ నారాయణ తెలిపారు. సోమవారం నిర్వహించిన తెలుగు పరీక్షకు 23,415 మంది విద్యార్థులు గాను 23,044 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. 371 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని చెప్పారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని వెల్లడించారు.
News March 16, 2026
HYD: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు HYD కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.
# SHARE IT


