News March 15, 2025

GDWL: అన్నం ఇరుక్కుని వృద్ధురాలు మృతి

image

గొంతులో అన్నం ఇరుక్కొని ఓ వృద్దురాలు మృతి చెందిన ఘటన మల్దకల్ మండలం అమరవాయిలో జరిగింది. స్థానికులు వివరాలు.. అమరవాయికి చెందిన శాంతమ్మ(75) రోజు ఇంటి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం హోలీ ఉండటంతో ఇంటి వద్ద భోజనం చేస్తుండగా అన్నం ముద్ద గొంతులో ఇరుక్కుని అస్వస్థతకు గురైంది. గద్వాల ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు.

Similar News

News February 27, 2026

బాలిక హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

image

ఉలిందకొండ PS పరిధిలో 2016లో జరిగిన 8 ఏళ్ల బాలిక హత్య కేసులో నిందితుడు బోయ గిడ్డయ్య(60)కు జీవిత ఖైదు విధిస్తూ కర్నూలు 1వ అదనపు జిల్లా & సెషన్స్ న్యాయమూర్తి పి.కమలా దేవి గురువారం తీర్పునిచ్చారు. కోర్టు రూ.7,000 జరిమానా విధించారు. చెల్లించకపోతే అదనంగా 2 నెలలు 15 రోజుల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఇదే కేసులో మరో నిందితుడుకి సాక్ష్యాల లోపంతో విముక్తి కల్పించారు.

News February 27, 2026

అనంతపురం: ఉపవాస దీక్షలో ఉన్న కానిస్టేబుల్ మృతి

image

అనంతపురం నగరంలో 3-టౌన్‌కు చెందిన నజీరుద్దీన్ ఆకస్మికంగా మృతి చెందారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉన్న ఆయన గురువారం తుది శ్వాస విడిచారు. 1804 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ నసీరుద్దీన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆకస్మిక మరణం వారి కుటుంబ సభ్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

News February 27, 2026

యాదాద్రి: రైతులకు అలర్ట్.. రెండు రోజులే గడువు

image

ప్రభుత్వ పథకాల లబ్ధికి తప్పనిసరి అయిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ గడువు ఈ నెల 28తో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 2,81,086 మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,56,283 (55.59%) మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. పీఎం కిసాన్ నిధి వంటి పథకాలు పొందాలంటే రిజిస్ట్రీ తప్పనిసరి. రైతు వేదికల్లో, మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చు. గడువులోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు రైతులను కోరుతున్నారు.