News March 24, 2024
పంత్‌తో పెళ్లి.. ఊర్వశీ రెస్పాన్స్ ఇదే!

టీమ్ ఇండియా క్రికెటర్ రిషభ్ పంత్‌తో పెళ్లిపై స్పందించాలని బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాకి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. అయితే సింపుల్‌గా ‘నో కామెంట్స్’ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా రిషభ్ పంత్‌పై ఆమె సోషల్ మీడియా వేదికగా ఇన్‌డైరెక్ట్ పోస్టులు పెడుతూ వార్తల్లోకి ఎక్కారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోందనే ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే.. ఈ విషయంపై పంత్ మాత్రం ఎప్పుడూ స్పందించలేదు.
Similar News
News March 13, 2026
‘జస్టిస్ ఘోష్ కమిషన్’పై APR 8న తీర్పు

TG: కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై <<17939261>>జస్టిస్ ఘోష్<<>> కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ కేసీఆర్, హరీశ్ రావు, IAS స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. సాక్షులుగా పిలిచి నిందితులుగా చేర్చారని వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదిక న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఏప్రిల్ 8కి వాయిదా వేసింది.
News March 13, 2026
BSNLలో 120 పోస్టులు.. మార్చి 31 వరకు గడువు

BSNLలో 120 Sr. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అప్లై చేయడానికి మార్చి 7 వరకు ఆఖరు తేదీ కాగా.. మార్చి 31 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BE/BTech (EE & టెలికమ్యూనికేషన్స్/ఎలక్ట్రానిక్స్/CS/IT/ఎలక్ట్రికల్/ఇన్‌స్ట్రుమెంటేషన్), CA/CMA అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ ఏప్రిల్ 1 – 8వరకు చేసుకోవచ్చు. వయసు 21- 30ఏళ్ల మధ్య ఉండాలి. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తారు. వెబ్‌సైట్: bsnl.co.in/
News March 13, 2026
BREAKING: తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.980 తగ్గి రూ.1,61,240కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పడిపోయి రూ.1,47,800 పలుకుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.


